‘మహర్షి’ ఏపీ & తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

Published on May 16, 2019 1:57 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయి వారం రోజులు అవుతున్న ‘మాహర్షి’ కలెక్షన్స్ మాత్రం చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఇప్పటికే నైజాంలో మహర్షి బ్రేక్ ఈవెన్ అయింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది.

మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. కాగా మహర్షి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఏరియాల వారిగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వివరాలు..

నైజాం – 21.67 కోట్లు
సీడెడ్ – 7.45 కోట్లు
గుంటూరు – 6.43 కోట్లు
తూర్పు గోదావరి – 5.63 కోట్లు
పశ్చిమ గోదావరి – 4.34 కోట్లు
కృష్ణా – 4.28 కోట్లు
నెల్లూరు – 2.10 కోట్లు
ఉత్తరాంధ్ర – 7.47 కోట్లు

తెలంగాణ & ఏపీలో మహర్షి ఫస్ట్ వీక్ కలెక్షన్ల షేర్ : రూ. 59.37 కోట్లు.

సంబంధిత సమాచారం :

More