ఇండియన్ సినిమా నుంచి వచ్చిన రేర్ అండ్ రీసెంట్ యానిమేషన్ చిత్రమే “మహావతార్ నరసింహ”. చాలా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఆడియెన్స్ సహా విమర్శకుల మన్ననలు అందుకుంది. ఇలా మొదట ఇండియాలోనే విడుదలైన ఈ సినిమా తర్వాత ఓవర్సీస్ మార్కెట్ లో కూడా విడుదల అయ్యింది.
ఇలా యూఎస్ మార్కెట్ లో కూడా సంచలన వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ ఇదే స్పీడ్ కొనసాగిస్తుంది. ఇలా ప్రస్తుతానికి 1.35 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని అదరగొట్టింది. దీనితో మహావతార్ నరసింహ మేనియా అదే రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. కానీ ఇపుడు కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ స్పీడ్ కి బ్రేక్ పడే అవకాశం మాత్రం ఉంది.

