సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న మహేంద్రన్ ‘నీలకంఠ’

సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న మహేంద్రన్ ‘నీలకంఠ’

Published on Feb 14, 2026 1:11 AM IST

Neelakanta Movie

మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దూసుకుపోతోంది. థియేటర్లలో తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్న మహేంద్రన్, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ (Sun NXT) ద్వారా డిజిటల్ ప్రేక్షకులను సైతం పలకరిస్తున్నాడు. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం.. కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచింది.

గ్రామీణ నేపథ్యం, ఊరి కట్టుబాట్లు, చిన్ననాటి తప్పుకు శిక్ష అనుభవించడం, ప్రేమను గెలిపించుకునేందుకు హీరో చేసే పోరాటం, సర్పంచ్ ఎన్నికల బరిలో దిగడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు రాంకీ పోషించిన పాత్ర సినిమాకు మరో ఆకర్షణ.

ఎం. మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు మార్క్ ప్రశాంత్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం (BGM) ప్రధాన బలంగా నిలిచాయి. ఆసక్తికరమైన కథనంతో సాగే ఈ రూరల్ డ్రామా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.

తాజా వార్తలు