‘మహర్షి’ కోసం విదేశాలకు మహేష్ !

maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఇటీవల హైద్రాబాద్లో ముగిసింది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ న్యూయార్క్, లాస్ వేగాస్ లలో జరుగనుంది. సెప్టెంబర్ రెండవ వారంలో అక్కడ షూటింగ్ మొదలు కానుంది. దాదాపు రెండు నెలల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో చిత్రానికి సంభందించిన ముఖ్య సన్నివేశాలతో పాటు సాంగ్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ ,అల్లరి నరేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.

Exit mobile version