ఇక మహేష్ 25 విడుదల తేదీపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు !

Published on Jul 3, 2018 11:41 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిన సంగతే. ఇప్పటికే రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు రాగా ఇప్పుడు ఖచ్చితమైన సమాచారం బయటికొచ్చింది. చిత్రాన్ని 2019 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

ప్రస్తుతం డెహ్రాడూన్ లోని ఒక కళాశాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జూలై 10 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. రైతుల సమస్యల నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి, అశ్విని దత్ లు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :