మహేష్ బాబు నూతన చిత్ర ప్రారంభోత్సవం రేపే !


సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో మైలురాయి లాంటి 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రాన్ని రేపు అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని, కథ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ బాబు కూడా ఈ స్క్రిప్ట్ పట్ల ఎగ్జైటెడ్ గా ఉన్నానని, సినిమా మొదలుపెట్టడం కోసం ఎదురుచూస్తున్నానని తన ఆసక్తిని తెలిపారు. అయితే ఇందులో మహేష్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం కొరటాల శివ ‘భరత్ అనే నేను’ షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ దాంతోపాటే ఈ సినిమాకి కూడా పనిచేయనున్నారు.