వైరల్ అవుతున్న మహేష్ 26 టైటిల్ !

Published on Apr 27, 2019 10:56 am IST

మహర్షి తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాతి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్నా ఈచిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈన్యూస్ కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈసినిమా కు ఇదే టైటిల్ ను ఖరారు చేస్తారా లేదో చూడాలి. ఇక ఈ టైటిల్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :