బరిలో దిగడానికి మహేష్ బాబు సిద్ధం.!

Published on Jan 21, 2021 1:59 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లాస్ట్ మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ గా నిలిచినా సంగతి తెలిసిందే. మరి ఆ హ్యాట్రిక్ హిట్ల పరంపరను కొనసాగించే దిశగా దర్శకుడు పరశురామ్ పెట్లతో అనౌన్స్ చేసిన తాజా చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ నుంచి ఒక సాలిడ్ మేకోవర్ తో రానున్న ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

మరి అలాగే ఈ సినిమా షూట్ కూడా అనుకున్న సమయం నుంచి అలా వాయిదా పడుతూ చాలా కాలమే అయ్యిపోయింది కానీ ఫైనల్ గా ఇప్పుడు దుబాయ్ షెడ్యూల్ కు గాను రంగం సిద్ధం అవుతుండగా సూపర్ స్టార్ మహేష్ అందుకు గాను సంసిద్ధం అవుతున్నారు. ఈ సినిమా కోసం కసరత్తులు మొదలు పెడుతూ హెవీ వర్కౌట్స్ స్టార్ట్ చేసిన మహేష్ తాజాగా షూట్ నిమిత్తం ప్రయాణం కూడా అయ్యారు.

మొత్తానికి మాత్రం సర్కారు వారి పాట బరిలో దిగడానికి మహేష్ బాబు సిద్ధం అయ్యిపోయాడు. ఇక ఈ చిత్రంలో మహేష్ తో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సహా మహేష్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ మాస్ ఫ్లిక్ ను నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :