ఒకవైపు మహేష్.. మరోవైపు బన్నీ.. ఒకటే దూకుడు

Published on Dec 9, 2019 8:08 pm IST

వచ్చే సంక్రాంతి పండుగ సినిమాలతో మరింత రసవత్తరంగా మారనుంది. రెండు పెద్ద సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ చిత్రాలు కేవలం ఒక్కరోజు వ్యవధిలో విడుదలకానున్నాయి. దీంతో ఏ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుంది, ఏ హీరో పైచేయి సాధిస్తాడు అనే చర్చ ఇప్పటి నుండే మొదలైంది. ప్రేక్షకుల మధ్య ఈ చర్చ నడుస్తుంటే బన్నీ, మహేష్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే బన్నీ పాటలతో సందడి చేయగా 11వ తేదీ టీజర్ వదులుతున్నాడు. అలాగే ఆ టీజర్ గ్లింప్స్ వీడియోను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మరోవైపు మహేష్ సినిమా నుండి ‘సూర్యిడివో చంద్రుడివో’ పాట ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు బయటకురానుంది. దీంతో ఇరు హీరోల అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటి నుండే రెండు సినిమాల విశేషాలను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే విడుడల తేదీలు దగ్గరపడే కొద్ది రెండు సినిమాల నుండి మరింత ఆసక్తికరమైన, క్వాలిటీ కంటెంట్ వెలువడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More