మహేశ్ సినిమాలో టాలెంటెడ్ కమెడియన్ !

Published on May 6, 2019 8:35 am IST

దర్శకుడు అనిల్ రావిపూడి తన తరువాత చిత్రాన్ని మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కోసం అనిల్ ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ రాశాడట. ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. కామెడీగా మాట్లాడే పాత్రను అనిల్ రావిపూడి రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే శ్రీనివాస్ రెడ్డి నటిస్తున్నారు. అనిల్ తన గత చిత్రాల్లో కూడా శ్రీనివాస్ రెడ్డికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మహేశ్ బాబు సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More