మహేష్, బన్నీల కోసం ఆ ఇద్దరు దర్శకులు వెయిటింగ్.

Published on Feb 19, 2020 10:07 am IST

ఈ ఏడాది సంక్రాంతి ఇద్దరు హీరోలకు మరపురాని విజయాలు కట్టబెట్టింది. మహేష్, అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ మూవీస్ రికార్డ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటెర్టైనర్ సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్-బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ఈ రెండు చిత్రాలు ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కగా థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

కాగా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు, తరువాత విరివిగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇంటర్వూస్, వేదికలు, ప్రసంగాలు, టూర్స్ తో విసిగిపోయిన వీరు సేదతీరడం కోసం కుటుంబాలతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. మహేష్ ఫ్యామిలీ తో కలిసి అమెరికా ట్రిప్ లో ఉండగా, అల్లు అర్జున్ కూడా కుటుంబంతో కలిసి వరల్డ్ టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐతే ఈ ఇద్దరు హీరోల కోసం ఇద్దరు దర్శకులు ఎదురు చుస్తున్నారు. బన్నీ టూర్ నుండి తిరిగివచ్చిన వెంటనే సుకుమార్ మూవీ షూటింగ్ లో పాల్గొనాలి. ఇక మహేష్ కొంచెం గ్యాప్ తీసుకొని వంశీ పైడిపల్లి మూవీ షూటింగ్ లో మే నుండి జాయిన్ అవుతారు.

సంబంధిత సమాచారం :