టీటీడీ చైర్మన్ ని కలిసిన మహేష్ అండ్ టీం

Published on Jan 17, 2020 1:19 pm IST

నేటి ఉదయం మహేష్ తో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ నిన్న సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల వెళ్లారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ లతో కూడిన చిత్ర యూనిట్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వారు టీటీడీ చైర్మన్ ని కలిసి దేవస్థానం గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిత్ర యూనిట్ మొత్తం నేడు వరంగల్ చేరుకోనున్నారు .

నేడు సాయంత్రం వరంగల్ జిల్లా హన్మకొండలో గల జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నందు సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవ సభ జరగనుంది. భారీగా తరలి రానున్న మహేష్ అభిమానవుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More