మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ పాటల చర్చలు !

Published on Jul 5, 2021 8:35 am IST

మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా సంగీత చర్చలు త్వరలో ప్రారంభం కానున్నాయట. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ తో త్రివిక్రమ్ కూర్చోనున్నారు. అలాగే ఈ సినిమాని అక్టోబర్ నుండి మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి.

కాగా మహేష్ బాబు పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీను తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :