మహేష్ కోసం కథ మార్చిన త్రివిక్రమ్ ?

Published on Jul 12, 2021 2:36 pm IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే రెగ్యులర్ మూస కథలకు తనదైన శైలి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసే త్రివిక్రమ్, మహేష్ తో చేయబోయే సినిమాకి మాత్రం కొత్త కథను తీసుకున్నాడని తెలుస్తోంది. నిజానికి తానూ మహేష్ తో చేయబోయే సినిమా కథ ఎప్పుడో ఫైనల్ అయినా.. సెకెండ్ వేవ్ లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో మళ్ళీ స్క్రిప్ట్ పై కూర్చున్నాడట.

ముఖ్యంగా కథలో హీరో క్యారెక్టర్ కూడా చాల కొత్తగా ఉంటుందని, అన్ని ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సినిమాని నడిపించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కథను మార్చడానికి కారణం.. ప్రేక్షకులు విదేశీ చిత్రాలు, సిరీస్‌లు చూస్తున్నారని.. వినూత్నంగా చేస్తేనే వారిని ఆకట్టుకోగలం అని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే కథలో చాల మార్పులు చేశాడట.

సంబంధిత సమాచారం :