మహర్షి ‘నాన్ బాహబలి రికార్డ్స్’ను బద్దలు కొడతాడా ?

Published on May 7, 2019 10:47 pm IST

అత్యధిక థియేటర్లలో ‘మహర్షి’ని విడుదల చేస్తునప్పటికీ.. ఇంకా కొన్ని చోట్ల మహేష్ బాబు ఫ్యాన్స్ కు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. తెలుగులో భారీ సినిమా వచ్చి చాలా కాలం అయిపోవడంతో సగటు ప్రేక్షకులు కూడా ‘మహర్షి’ టికెట్స్ కోసం పోటీ పడుతున్నారు. గత రెండు రోజులుగా ఈ హడావుడే ఉందట. అంటే రిలీజ్ కి నాలుగు రోజుల ముందు నుంచే ఈ రేంజ్‌ లో హడావుడి వుంటే.. ఇక సినిమాకు గాని సూపర్ హిట్ టాక్ వస్తే.. ‘మహర్షి’ దెబ్బకి నాన్ బాహబలి రికార్డ్స్ అన్నీ తుడుచుకుపెట్టి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరి మే 9న రాబోతున్న ‘మహర్షి’ సినిమా టాక్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికైతే సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎక్కడా చూసిన ‘మహర్షి మహర్షి’ అంటూ సినిమాని పాజిటివ్ మూడ్ లోకి తీసుకెళ్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నట్లు అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ఈ కామెడీ హీరో హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More