టైగర్ ష్రాఫ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న మహేశ్ బాబు..!

Published on Sep 5, 2021 3:00 am IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి పెద్దగా చెప్పన్నక్కర్లేదు. ఆయనకున్న క్రేజ్ పరంగా సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు పలు కమర్షియల్ యాడ్‌లలో కూడా నటిస్తుంటాడు. అయితే తాజాగా ఓ యాడ్‌లో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో మహేశ్ స్క్రీన్ పంచుకోబోతున్నాడు.

మౌత్ ఫ్రెషనర్ ప్రకటనలో వీరిద్దరు కలిసి నటించారు. దీనికి సంబంధించిన కమర్షియల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కాబోతుంది. మహేష్ ఇంతకు ముందు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి కోలా ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు మరియు టైగర్ ష్రాఫ్ ఇద్దరు అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న క్రేజీ స్టార్స్ కాబట్టి ఈ యాడ్ వారి అభిమానులకు ఓ మంచి ట్రీట్ అవుతుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :