మహేశ్ బాబు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారండోయ్..!

Published on Jul 17, 2021 1:49 am IST


సాధారణంగా తమ అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచి ఫ్యాన్స్ హడావుడి మామూలుగా ఉండదు. ఎప్పటిలాగానే ప్లెక్సీలు, దండలు, కేక్ కటింగ్స్, రక్తదానం, అన్నదానం వంటి పాత పద్ధతులను కంటిన్యూ చేస్తూనే ఈ మధ్య సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో ట్రెండ్ చేయడం కూడా అభిమానుల హడావుడిలో ఓ భాగమైపోయింది. తమ అభిమాన హీరో పేరు ఎంతగా ట్రెండ్ అయితే ఫ్యాన్స్ అంతగా సంతోషం వ్యక్తం చేస్తుంటారు.

అయితే సూపర్ స్టార్ మహేశ్‌ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న కావడంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మహేశ్ పుట్టినరోజు వేడుకలు జరుపాలని వారంతా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఏం చేయాలో చెబుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూస్తే సర్కారువారి పాట ఫస్ట్‌ లుక్‌ కౌంట్‌డౌన్‌ జూలై 30న మొదలవుతుందని, ఆగస్టు 1 నుంచి బర్త్‌డే కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే మంచి ఊపుమీద కనిపిస్తున్న ఫ్యాన్స్ ఈ సారి మహేశ్‌కి ఏ రేంజ్‌లో బర్త్‌డే విషెష్ చెబుతారో, ఎన్ని రికార్డులు తెచ్చిపెడుతారో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :