బ్లాస్టర్ తో ఆల్ టైం రికార్డు సెట్ చేసి పెట్టిన బాబు.!

Published on Aug 10, 2021 8:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. మరి దీని నుంచి మహేష్ బర్త్ డే కానుకగా అదిరే బ్లాస్టర్ ను మేకర్స్ నిన్ననే విడుదల చేసిన సంగతి తెలిసిందే.. మరి ఈ టీజర్ వీడియో భారీ రెస్పాన్స్ తో మన టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టే పనిలో పడింది.

అయితే అనుకున్న సమయానికన్నా ముందే వచ్చేసినా ఈ టీజర్ ఇప్పుడు 24 గంటలు పూర్తయ్యేసరికి ఆల్ టైం రికార్డునే సెట్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ టీజర్ గత 24 గంటల్లో ఏకంగా 23.05 మిలియన్ వ్యూస్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో బాబు ఖాతాలో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్ రికార్డ్ పడ్డట్టు అయ్యింది..

మరి లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 4 లో నిలిచినట్టు తెలుస్తుంది.. మొత్తానికి మాత్రం బాబు ర్యాంప్ గట్టిగానే షురూ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :