మహేష్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్న మణిరత్నం.?

మహేష్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్న మణిరత్నం.?

Published on Oct 2, 2015 1:47 AM IST

mahesh-babu-mani-ratnam
గత ఏడాది సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ మణిరత్నం ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాకి శ్రీకారం చుట్టాడు. అందులో తెలుగు స్టార్ హీరోస్ అయిన కింగ్ నాగార్జున – సూపర్ స్టార్ మహేష్ బాబులను హీరోలుగా సెలక్ట్ చేసాడు. అప్పట్లో నాగార్జున – మహేష్ బాబులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సుహాసిని మణిరత్నం కూడా తెలిపింది. కానీ ఆ తర్వాత అది ఆగిపోయింది, మణిరత్నం కూడా ఆ తర్వాత ఓకే బంగారం సినిమాలో బిజీ అయిపోయి, ఆ సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టేసారు. ఆ తర్వాత అదే మల్టీ స్టారర్ సినిమాని దల్క్వేర్ సల్మాన్ – కార్తీలతో తమిళ్ – మలయాళంలో చేయడానికి సిద్దం అయ్యారు.

కానీ దల్క్వేర్ సల్మాన్ డేట్స్ విషయంలో కాస్త సమస్య రావడం వలన మణిరత్నం ఇప్పుడు ఈ సినిమాని తెలుగు, తమిళంలో చెయ్యడానికి సిద్దం అయ్యారు. దాంతో మళ్ళీ మణిరత్నం ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుని తీసుకురావాలని చూస్తున్నారు. త్వరలోనే మహేష్ బాబుని కలిసి తన ప్రాజెక్ట్ గురించి అప్రోచ్ కానున్నాడు. మహేష్ కూడా మణిరత్నం వర్క్ అంటే చాలా ఇష్టపడతాడు. మహేష్ బాబు కూడా తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ సినిమాని పూర్తి చేసేస్తాడు. అలాగే మణిరత్నం వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. దాంతో మహేష్ బాబు మణిరత్నం ఫైనల్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం. అది టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు