‘బ్రహ్మోత్సవం’లో జాయినింగ్ కి డేట్ ఫిక్స్ చేసిన మహేష్

‘బ్రహ్మోత్సవం’లో జాయినింగ్ కి డేట్ ఫిక్స్ చేసిన మహేష్

Published on Sep 10, 2015 6:30 PM IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ ఆయన బర్త్ డే కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేసిన మహేష్ బాబు ప్రస్తుతం హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించనున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని ప్రారంభించినప్పుడే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ మహేష్ బాబు శ్రీమంతుడు ప్రమోషన్స్ కోసం టైం తీసుకోవడంతో కాస్త ఆలస్యం అయ్యింది.

తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి అన్నీ సిద్దం చేసుకుంది. రేపటి నుంచి ఈ సినిమా షూట్ ని స్టార్ట్ చేయనున్నారు. మహేష్ బాబు మాత్రం సెప్టెంబర్ 16 నుంచి బ్రహ్మోత్సవం సెట్లో జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి ఆగకుండా ఏకధాటిగా షూటింగ్ చేసే విధంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. కంటిన్యూగా షూటింగ్ చేసి 2016 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు