రాజమౌళితో కన్నా ముందే మహేష్ పాన్ ఇండియన్ ఫ్లిక్!

Published on Aug 10, 2021 9:00 am IST

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచే ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు ఇండియన్ వైడ్ రిలీజ్ కి వెళ్తున్నాయి. పలువురు స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోలు కూడా తమ చిత్రాలకు పాన్ ఇండియన్ లెవెల్ స్పాన్ తెచ్చుకొని రిలీజ్ కి సన్నద్ధం అవుతున్నారు. అయితే ఒక్క నేషనల్ లెవెల్లోనే కాకుండా హాలీవుడ్ లెవెల్ చార్మ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మన టాలీవుడ్ నుంచి ఒకరు.

మరి మహేష్ ని ఆ స్టాండర్డ్స్ సినిమాలో చూడాలని ఎప్పుడు నుంచి అభిమానులు సహా మూవీ లవర్స్ అనుకుంటున్నారు. మరి అది ఎట్టకేలకు సెన్సేషనల్ కాంబో రాజమౌళితో నెరవేరేలా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. కానీ అది బహుశా తమ చిత్రంతోనే ముందు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని నిర్మాత నాగవంశీ అంటున్నారు.

సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ చిత్రమే బహుశా పాన్ ఇండియన్ లెవెల్లోనే ఉంటుందని అది కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఇక అన్ని సెట్టయితే కనుక రాజమౌళితో సినిమా కన్నా ముందే మహేష్ పాన్ ఇండియన్ ఫ్లిక్ స్టార్ట్ అవ్వడం కన్ఫర్మ్..

సంబంధిత సమాచారం :