వైరల్ : ఫ్యాన్స్ కోసం మహేష్ స్పెషల్ నోట్..నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ.!

Published on May 7, 2022 4:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” ఈరోజు అత్యంత ఘనంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోబోతుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ మరియు ప్రాజెక్ట్ కి సంబంధించి మహేష్ తన అభిమానుల కోసం ఒక స్పెషల్ ప్రెస్ నోట్ ని తాను రిలీజ్ చేశారు.

తమ యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన సర్కారు వారి పాట చిత్రం ఈ మే నెల 12న ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వచ్చిన పాటలు మంచి సక్సెస్ అయ్యాయి అదే విధంగా సినిమా ని కూడా థియేటర్స్ లో చూసి మీ స్పందనను తెలియజేయాలని కోరుకుంటున్నానని అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో నా నెక్స్ట్ సినిమా జూన్ నుంచి షూటింగ్ మొదలు కానుంది అని మహేష్ ఈ స్పెషల్ నోట్ ద్వారా మహేష్ తెలిపాడు. దీనితో ఈ నోట్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :