మాటల్లేవ్…చేతులెత్తి దండం పెట్టడం తప్ప – మహేశ్ బాబు

Published on May 19, 2019 9:39 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. అందుకే చిత్రబృందం మాహర్షి విజయోత్సవ వేడుకను నిన్న విజయవాడలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు.

కాగా ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. ‘రాఘవేంద్రరావు మామయ్య గారికి థాంక్స్. రాజకుమారుడు చేసేప్పుడు ఒక ఫ్రెండ్ లాగా చూసుకున్నారు నన్ను. ఆయనకి ఎప్పుడు ఋణపడి ఉంటాను. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన దత్ గారు నా 25వ సినిమా ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వైజయంతి బ్యానర్ తో కలిసి దిల్ రాజు గారి బ్యానర్, పివిపి గారి బ్యానర్ కలిసి నా 25వ సినిమా ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. షూట్ ఫస్ట్ డే చెప్పాను ఇది పోకిరి స్క్వేర్ అవుతుందని. మూడు కారక్టర్లలో నాకు బాగా నచ్చింది స్టూడెంట్ కారక్టర్ అని అన్నారు.

మహేశ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ 25వ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీకు ఋణపడి ఉంటాను. నాన్నగారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నా 25వ సినిమాకి మీరిచ్చిన ఈ విజయానికి నా దగ్గిర మాటల్లేవ్…చేతులెత్తి దండం పెట్టడం తప్ప’ అని మహేశ్ తెలిపారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

More