సీఎం అనగానే భయం వేసింది: మహేష్

సీఎం అనగానే భయం వేసింది: మహేష్

Published on Apr 8, 2018 10:05 AM IST

‘ఇప్పటి నుంచి ట్రెండు మారుతుంది. ఒక హీరో ఈవెంట్ కి మరొక హీరో తప్పకుండా వస్తాడు’ అని హీరో మహేష్ బాబు నిన్న జరిగిన ఈవెంట్ లో మాట్లాడారు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 50 వేల మంది అభిమానులు వచ్చారు. యూట్యూబ్ లో అలాగే టీవీల్లో మిలియన్ల సంఖ్యలో ఈవెంట్ ను వీక్షించారు. మహేష్ – జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడం అందరిని ఎంతగానో ఆకర్షించింది. అలాగే వేడుకలో మహేష్ మాట్లాడిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.

‘కృష్ణ గారి అబ్బాయనే నేను’ ఇలా మాట్లాడటం తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నా అని మహేష్ తన స్పీచ్ ని మొదలు పెట్టారు. ఇప్పటి నుంచి ఫంక్షన్ల ట్రెండు మారుతుంది. ఇతర హీరోలు కూడా అతిధులుగా వస్తారు. అందరి సినిమాలు ఆడితేనే బావుంటుంది. మేము బాగానే ఉంటాం. అభిమానులే ఇంకా బాగుండాలి. ఇక ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. మొదట కొరటాల శివ గారు కథ చెప్పినప్పుడు సీఎం క్యారెక్టర్ అనగానే కొంచెం భయం వేసింది. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఎప్పటికి నాకు సినిమాలే ముఖ్యం. ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఈ సినిమా చేశాను. నా కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇదే అంటూ మహేష్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 20న భరత్ అనే నేను విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు