మహేష్ 28 రిలీజ్ వాయిదా పడనుందా ?

Published on Mar 22, 2023 3:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ SSMB 28 పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. దాదాపుగా పుష్కర కాలం తరువాత మహేష్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఉగాది సందర్భంగా ఈమూవీ నుండి అప్ డేట్ ఇవ్వలేకపోతున్నాం అని, సరైన టైంకి అప్ డేట్ అనౌన్స్ చేస్తాం అంటూ నిన్న ఈ మూవీ నిర్మాతలు ప్రకటించారు.

ఇక ప్రస్తుతం శరవేంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ టాలీవుడ్ లో బజ్ గా మారింది. నిజానికి ఈమూవీని ఆగష్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇటీవల నిర్మాత నాగవంశీ ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా తెలిపారు. అయితే నేడు అదే డేట్ న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. మరోవైపు అదే డేట్ కి రజినీకాంత్ జైలర్ తో పాటు రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలు కూడా రిలీజ్ కానుండడంతో తమ సినిమాని వాయిదా వేయాలని SSMB 28 టీమ్ ఆలోచనలు చేస్తోందట. మరోవైపు ఈమూవీ 2024 సంక్రాంతికి వాయిదా పడ్డట్లు కూడా కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై ఆ మూవీ టీమ్ నుండి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :