రేపు ఇండియా వర్సస్ ఆస్టేలియా మ్యాచ్ లో మెరవనున్న మహేష్.

Published on Jun 8, 2019 3:19 pm IST

ఇటీవల విడుదలైన ‘మహర్షి’ మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా గడిపిన మహేష్, ఆమూవీ సక్సెస్ ని ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. జర్మనీలో విహారం ముగించుకున్న మహేష్ అక్కడ నుండి నేరుగా ఇటలీ వెళ్లారు. మహేష్ బాబు ఫారిన్ టూర్ లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రేపు ఆయన ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ కి కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ క్రెకెట్ మెగా టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే.రేపు ఈ టోర్నమెంట్ లో భాగంగా ఓవల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా రెండు మేటి జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గం.లకు మ్యాచ్ జరగనుంది.

మహేష్ తన టూర్ షెడ్యూల్ లో ముందుగానే ఈ మ్యాచ్ ని ప్లాన్ చేశారట. మరి రేపు మహేష్ ఓవల్ స్టేడియం లో మ్యాచ్ కు హాజరై ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్నారు. రేపు మహేష్ పై కెమెరా మెన్ ఫోకస్ చేయగానే ఇండియన్ ఫిలిం స్టార్ మహేష్ అక్కడున్నారు అని కామెంటేటర్ చెప్పగానే మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోవడం ఖాయం.

సంబంధిత సమాచారం :

More