లడఖ్ బయలుదేరిన ‘ఆగడు’ చిత్ర బృందం

Published on May 17, 2014 2:48 pm IST

Mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘ఆగడు’ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం షూటింగ్ మంచి ఊపు అందుకుంది ఇదే ఊపు లో చిత్ర బృందం మొత్తం ఈ నెల 20 న లడఖ్ బయలుదేరనుంది.

లడఖ్ లో ఒక పెద్ద షెడ్యూల్ ని చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో రెండు పాటల తో పాటు కొన్ని సన్నివేసాలని కూడా చిత్రీకరిస్తారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు’ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తున్నారు.

మహేష్ బాబు సరసన తమన్నా మొదటి సారి నటిస్తుంది. ప్రముఖ విలన్ సోను సూద్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :