త్రివిక్రమ్ ఫస్ట్ షెడ్యూల్ ను అందుకే త్వరగా ముగించాడట !

త్రివిక్రమ్ ఫస్ట్ షెడ్యూల్ ను అందుకే త్వరగా ముగించాడట !

Published on Sep 25, 2022 8:00 PM IST

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న చిత్రం రెగ్యులర్ షూట్‌ను సెప్టెంబర్ రెండవ వారం నుంచి స్టార్ట్ చేశారు. అయితే, మూడు రోజుల షూట్ తర్వాత, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అని, రెండో షెడ్యూల్ దసరా తర్వాత నుంచి ఉంటుందని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అయితే, తాజాగా ఫస్ట్ షెడ్యూల్ షూట్ కి సంబంధించి ఒక పుకారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ లో ప్లాన్ చేసిన యాక్షన్ సీన్స్ అవుట్ ఫుట్ విషయంలో మహేష్ – త్రివిక్రమ్ ఇంకా బెటర్ మెంట్ కోరుకున్నారట.

అందుకే, ఈ ఫస్ట్ షెడ్యూల్ ను త్వరగా ముగించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌ లో కనిపించబోతున్నాడు. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ కూడా మహేష్ కి సరిపోయే పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు థమన్ సంగీతం అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు