అందరినీ ఆకర్షిస్తున్న మహేష్ బాబు కాస్ట్లీ వాచ్

aagadu

మామూలుగా ఫిల్మ్ స్టార్స్ కి బాగా కాస్ట్లీ వాచ్ లు అంటే బాగా ఇష్టం. అది అందరికీ బాగా తెలిసిన విషయమే.. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ 10 లక్షలు ఖరీదు చేసే వాచ్ ఎలా ఉంటుంది? పోలీస్ ఆఫీసర్, 10 లక్షల వాచ్ ఏంటా అనుకుంటున్నారా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలో కట్టిన వాచ్ అందరినీ ఆకర్షిస్తోంది.

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘ఆగడు’ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ ఓ డైలాగ్ చెబుతున్నాడు. అక్కడ కాస్త పాజ్ పెట్టి చూస్తే మహేష్ కట్టిన ఖరీదైన వాచ్ మీకు కనపడుతుంది. ఆ విషయంలోకి వెళితే ఆ వాచ్ పియాజెట్ పోలో 45 క్రోనోగ్రఫ్, దీని ధర 16,000 యుఎస్ డాలర్స్.. అనగా మన ప్రకారం అక్షరాల 10 లక్షలు.

ఇప్పటివరకూ మహేష్ బాబుకి వాచ్ లు నటే ఇష్టం అని చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ టీజర్ తో మహేష్ బాబు బాగా ఫేమస్ అవుతాడు.

 

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version