మహేష్ మనస్ఫూర్తిగా ఆనందించిన వేళ

Published on Jun 13, 2019 7:16 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇష్టమైన ఆట క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్‌ను ఇష్టంగా ఫాలో అవుతుంటారు. తాజాగా కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన ఆయన వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కూడా వెళ్లారు. అక్కడే తన ఆల్ టైమ్ ఫెవరెట్ క్రికెటర్, ఒకప్పటి వెస్ట్ ఇండీస్ ఫాస్ట్ బౌలర్ ఆండీ రోబర్ట్స్ ను చూశారట.

ఇంకేముంది ఆయనలోని వీరాభిమాని చటుక్కున నిద్రలేచాడు. వెంటనే వెళ్లి ఆ లెజెండరీ క్రికెటర్ పక్కన నిలబడి ఫోటో కూడా తీయించుకున్నారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ట్వీట్ రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాల్లో స్టార్ హీరో అయిన మహేష్ బాబుతో అందరూ ఫోటో దిగడానికి ఆరాటపడితే మహేష్ మాత్రం ఇలా తన తన అభిమాన క్రికెటర్‌తో ఫోటో దిగి ఆనందపడిపోవడం చూస్తే ప్రతి ఒక్కరిలోనూ నిజమైన అభిమాని తప్పకుండ ఉంటాడని అనిపిస్తోంది కదూ.

సంబంధిత సమాచారం :

More