ఆడపిల్లల వివక్ష పై మహేష్ బాబు సందేశం !

Published on Jan 25, 2019 4:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేష‌న‌ల్ గాళ్ల చైల్డ్ దినోత్స‌వం సంద‌ర్భంగా తన శైలిలో ప్ర‌జ‌ల‌కు సందేశాత్మ‌క పిలుపును ఇచ్చాడు. త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆయన పోస్ట్ చేస్తూ… మహిళల పై మనదేశంలో వివక్ష ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం అని.. ఒక పక్క ఈ వివక్షను పోగొట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి.

అయినా చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఈ వివక్ష ఎక్కువ ఉంది. ఆడపిల్లల పై ఈ వివక్షను పోగొట్టాలి, ఈ విషయంలో ప్రతిఒక్కరిలో మార్పు వచ్చేలా మనమందరం మన ప్రయత్నం చెయ్యాలని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా అభిమానులను ప్రేక్షకులను కోరాడు.

సంబంధిత సమాచారం :