మహేష్ బాబు సినిమా డెహ్రాడూన్ లో.. !

మహేష్ బాబు సినిమా డెహ్రాడూన్ లో.. !

Published on Jul 11, 2018 12:41 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం కోసం గత నెల రోజులు నుంచి డెహ్రాడూన్ లో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రబృందం డెహ్రాడూన్ లో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం డెహ్రాడూన్ లో షూట్ జరుపుకున్నట్లుగానే యు.ఎస్ లో కూడా షూట్ జరుపుకోనుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ ఈ చిత్రంలో రెండు వేరు వేరు లుక్స్ లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు