సర్కారు వారి పాట “ఫస్ట్ నోటీస్ కి టైమ్ ఫిక్స్”

Published on Jul 30, 2021 6:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ లుక్, మాస్ పోస్టర్ లతో ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ప్రేక్షకులని, అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం నుండి ఫస్ట్ నోటీస్ కి టైమ్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

జులై 31 వ తేదీన ఫస్ట్ నోటీస్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రేపు సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ నోటీస్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. అయితే మరొక పది రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు ఉండటం తో ఈ పది రోజులు మహేష్ అభిమానులకి పండుగ వాతావరణం తలపించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన మొదటి సారిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :