గౌతమ్ కి మహేష్ గ్రేటెస్ట్, బ్యూటిఫుల్ విషెష్.!

Published on Aug 31, 2021 11:42 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వెండితెరపై ఎంతలా అభిమానులను అలరిస్తారో అదే సమయంలో ఓ భాద్యత గల భర్తగా తండ్రిగా తన కుటుంబంతో అంతే అందమైన జీవితాన్ని కొనసాగిస్తారు. మరి ఈరోజు మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని బర్త్ డే సందర్భంగా మహేష్ బ్యూటిఫుల్ విషెష్ తెలియజేసారు.

పదిహేనేళ్ళు కి వచ్చిన గౌతమ్ ని ఒక్కో ఏడాది పెరుగుతూ ఉండడం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. వెళ్లి ప్రపంచాన్ని జయించు ఈరోజుల్లో ఎప్పుడూ నీకు స్పెషల్ డే లానే ఉండాలి నా ప్రేమ ఎప్పుడూ నీతో ఉంటుంది అని మహేష్ గౌతమ్ కి గ్రేటెస్ట్ విషెష్ తెలియజేసారు. మరి వీరిద్దరూ కలిసి 1 సినిమాకి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” షూట్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :