“భరత్ అనే నేను” డిలీటెడ్ సీన్.. మేకర్సే కామెడీ చేస్తున్నారే

“భరత్ అనే నేను” డిలీటెడ్ సీన్.. మేకర్సే కామెడీ చేస్తున్నారే

Published on Mar 14, 2025 10:50 AM IST

Bharth ana nenu

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు తన కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్ ని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇపుడు హోళీ పండుగ కూడా వచ్చేసింది. అయితే ఈ హోళీ పండగకి మహేష్ బాబు అభిమానులకి చిన్న అవినాభావ సంబంధం ఉంది.

మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన రెండో సినిమా భరత్ అనే నేను కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో అప్పట్లో హోళీ ఫైట్ సీన్ ని చేసి డిలీట్ చేసేసారు. కానీ ఈ సీన్ ఇప్పుడు వరకు మేకర్స్ వదల్లేదు. ఆ మధ్య అంతా ఈ ఫైట్ సీన్ వదలాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు కానీ ఫలితం లేకపోయింది.

ఇక లేటెస్ట్ గా అయితే ఏకంగా ఆ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే కామెడీ చేస్తున్నారు. తమ సోషల్ మీడియా నుంచి మరో హోళీ పండుగ భరత్ అనే నేను సినిమా నుంచి హోళీ ఫైట్ లేకుండానే చేసుకుందాం అంటూ టీజ్ చేస్తున్నారు. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసి ఈ రకంగా తమ ఎమోషన్స్ తో ఫన్ చేస్తున్నారని బాధ పడుతున్నారు. మరి ఈ అవైటెడ్ సీన్ ఎప్పటికి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు