“సర్కారు” లో స్పెషల్ అట్రాక్షన్ గా మహేష్ మాస్ డైలాగ్స్.!?

Published on May 28, 2021 7:02 am IST

వరుసగా మూడు భారీ హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ ఇదే హ్యాట్రిక్ పరంపర నెక్స్ట్ కూడా స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేసిన చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ముఖ్యంగా పరశురామ్ పెన్నింగ్ పై మహేష్ బాబు అభిమానులు ఒక లెక్కలో అంచనాలు పెట్టుకున్నారు.

అయితే వాటికి ఏమాత్రం తగ్గకుండా పరశురామ్ ఫుల్ ఫీస్ట్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సినిమాతో మహేష్ నుంచి వింటేజ్ ట్రీట్ ఇవ్వాలని ఆ ఊహల్లో తేలుతున్నారు. వాటికి తగ్గట్టుగా ఈ చిత్రంలో మహేష్ పేల్చే ప్రతీ పంచ్ డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు తెలుస్తుంది.

మహేష్ లాస్ట్ చిత్రాల్లో సింపుల్ లైనర్స్ తో క్లాస్ లో మాస్ వార్నింగ్ సీన్స్ ఉండగా ఈసారో మాత్రం డోస్ అలా ఉండదట కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ మాస్ గాను ప్రత్యేక యాసలో కూడా మహేష్ మాటల తూటాలు ఉంటాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అవన్నీ ఎలా ఉంటాయో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :