మహేశ్ కి నచ్చనిది బన్నీకి నచ్చింది !

Published on May 8, 2019 3:45 am IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని మహేశ్ తో చెయ్యాలనుకొని అల్లు అర్జున్ తో చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే సుకుమార్ మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథను కూడా రాశాడు, మహేష్ కు వినిపించాడు కూడా. కానీ మహేష్ కి ప్రస్తుత పరిస్థితిల్లో ఇలాంటి సినిమాకంటే మంచి ఎంటర్ టైనర్ చేస్తే బాగుంటుందని ఎంటర్ టైనింగా సాగే వేరే కథ ఉంటే చెప్పమన్నారట.

అంతలో అనిల్ రావిపూడి అలాంటి కథ చెప్పడంతో మహేశ్ అనిల్ సినిమాకి ఒకే చేశాడు. ఈ లోపు సుకుమార్ స్మగ్లింగ్ నేపథ్యంలో కథను తీసుకెళ్లి అల్లు అర్జున్ కు వినిపించి.. సినిమాను ఒకే చేసుకున్నాడు. మొత్తానికి మహేష్ బాబుకి నచ్చని కథ బన్నీకి నచ్చిందన్నమాట. ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More