మహేష్,కొరటాల ఎమోషనల్ బాండింగ్ మాములుగా లేదుగా…!

Published on Jun 15, 2019 1:08 pm IST

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు,దర్శకుడు కొరటాల శివలది ప్రత్యేక అనుబంధం. ఓటమి ఎరుగని ఈ దర్శకుడు చేసిన నాలుగు సినిమాలలో రెండు సినిమాలు మహేష్ బాబు హీరోగా చేయడం విశేషం. ప్రభాస్ హీరోగా వచ్చిన “మిర్చి” మూవీతో దర్శకుడిగా మారిన ఈరచయిత గతంలో భద్ర,సింహా,బృందావనం,ఊసరవల్లి వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు.

ఈ రోజు కొరటాల శివ జన్మదినం పురస్కరించుకొని మహేష్ తనకు ‘శ్రీమంతుడు’,’భరత్ అనే నేను’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందినందుకు కృతజ్ఞతగా ఓ ఎమోషన్ ట్వీట్ చేసారు. “ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అత్యంత టాలెంట్,విజనరీ డైరెక్టర్ అయిన కొరటాల శివకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని చెవుతూ ఆప్యాయంగా అతన్ని హత్తుకొన్న ఓ ఫొటో ని పోస్ట్ చేశారు. దీనితో మహేష్, కొరటాల మధ్య ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉందా అని సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More