సరిలేరు టీజర్.. అందరి చూపు దేవిశ్రీ వైపే

సరిలేరు టీజర్.. అందరి చూపు దేవిశ్రీ వైపే

Published on Nov 22, 2019 9:00 AM IST

dsp1

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదలకానుంది. దీనిపై మహేష్ అభిమానుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. టీజర్లోని ప్రతి అంశం గొప్పగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మ్యూజిక్. టీజర్ క్లిక్ అవ్వాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉండాలని భావిస్తున్నారు.

ఎండుకంటే మహేష్ గత చిత్రం ‘మహర్షి’కి డిఎస్పీనే మ్యూజిక్ అందించారు. కానీ ఆ సంగీతం అభిమానుల్ని పూర్తిస్థాయిలో అలరించలేదు. దేవి రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడని, కొత్తగా ఏమీ లేదనే విమర్శలు వచ్చాయి. అలాంటిది ఈ సినిమాకి కూడా దేవి శ్రీ సంగీతం అంటే మరీ రొటీన్ అయిపోతుందేమో అనే అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. అయితే దేవిశ్రీ సినిమాను అనౌన్స్ చేసే రోజే ఏం కంగారు పడొద్దు మీరు మెచ్చేకునేలా ట్యూన్స్ ఇస్తానని మాటిచ్చారు.

దాన్ని బాగా గుర్తుపెట్టుకున్న అభిమానులు దేవి శ్రీ ఇచ్చిన మాట ప్రకారం తాము సంతృప్తి చెందే రీతిలో సంగీతం ఇచ్చారో లేదో సాయంత్రం చూస్తాం అంటున్నారు. మరోవైపు చిత్ర సన్నిహిత వర్గాలు మాత్రం గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’కు కూడా అలానే ట్యూన్స్ కట్టారని చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు