ఐ ఫోన్లు బహుమతిగా ఇచ్చిన మహేష్ బాబు !

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఇటీవలే హైదరాబాద్లో అంగ రంగ వైభవంగా జరిగింది. చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. మహేష్ కూడ చిత్ర ఫలితంపై గట్టి నమ్మకంతో ఉన్నారు.

తాజాగా మహేష్ సినిమా కోసం కష్టపడి పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం ఖరీదైన ఐ ఫోన్ టెన్ లు బహుమతులుగా అందించారట. గతంలో కూడ మహేష్ ‘శ్రీమంతుడు’ ఘన విజయం అందుకున్న సందర్బంగా దర్శకుడు కొరటాల శివకు ఖరీదైన కారును ప్రెజెంట్ చేసిన సంగతి తెలిసిందే.