‘శ్రీమంతుడు’ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఫుల్ హ్యాపీగా అయిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ లోబిజీ గా ఉన్నాడు. బ్రహ్మోత్సవం సెకండ్ షెడ్యూల్ ప్రెజంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీన్ని కాసేపు పక్కన పెడితే.. మామూలుగా కంటిన్యూ షెడ్యూల్స్ తో సినిమాని పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటాడు. అలా కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని వచ్చాక మళ్ళీ కొత్త సినిమా షూటింగ్ ని ప్రారంభిస్తాడు.
ప్రస్తుతం బ్రహ్మోత్సవం షార్ట్ షార్ట్ షెడ్యూల్స్ మాత్రమే జరుగుతున్నాయి. నవంబర్ నుంచి గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసారు. దాంతో మహేష్ ఈ వారంతంతో ముగియనున్న సెకండ్ షెడ్యూల్ తర్వాత మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం పారిస్ వెళ్లనున్నాడు. అక్కడ కాస్త క్వాలిటీ టైం గడిపిన తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తారు. నవంబర్ మొదటి వారం నుంచి ఊటీలో ఓ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కంటిన్యూగా షూట్ చేసి మార్చి కల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తారు. 2106 ఫస్ట్ సమ్మర్ రిలీజ్ గా ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్ ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.


