పైరసీ గురించి తెలియజేయండి అంటున్న మహేష్

Published on Jan 11, 2020 8:00 pm IST

పైరసి అనేది చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తుంది. పైరసీ జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అందుబాటులో ఉన్న సాంకేతికను ఉపయోగించుకుంటూ పైరసీ మాఫియా చెలరేగిపోతుంది. దారుణంగా సినిమా విడుదలైన సాయంత్రానికి పైరసీ వీడియో నెట్లో దర్శన మిస్తుంది. నిర్మాతలకు కోట్ల నష్టం చేకూర్చుతున్న ఈ పైరసీ ని అదుపు చేయడం ఎవరివల్లా కావడం లేదు. కాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ పైరసీ కి వ్యతిరేకంగా పనిచేయాల్సిందిగా ఫ్యాన్స్ కి పిలుపునిచ్చాడు. పైరసీ కి సంబంధించిన వెబ్ సైట్ లింక్స్ ని మెయిల్ చేయవలసిందిగా కోరారు. దీనికోసం ఓ ప్రత్యేకమైన జిమెయిల్ అకౌంట్ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. దీనివలన 100 శాతం పైరసీ ని కట్టడి చేయలేకున్నప్పటికీ ఎంతో కొంత మేర అదుపు చేయవచ్చు.

ఇక నేడు విడుదలైన సరిలేరు నీకెవ్వరు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి ఓ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీశారని చెప్పుకుంటున్నారు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా, విజయ శాంతి కీలక రోల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :