మహేష్ కౌంట్ 6 మిలియన్లకు చేరిపోయింది

Published on Nov 24, 2020 9:09 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ మహేష్ అభిమానుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడ మహేష్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అన్ని మాధ్యమాల్లోనూ యాక్టివ్ గా ఉంటారాయన. ట్విట్టర్లో ఇప్పటికే 10 మిలియన్ మార్క్ దాటేసి 11 మిలియన్లకు చేరువలో ఉన్న ఆయన ఇన్స్టాగ్రమ్ నందు కూడ హవా చూపిస్తున్నారు.

తాజాగా ఆయన ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్ల మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మహేష్ నిత్యం అభిమానులతో అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరగ్గా జనవరి నుండి షూట్ మొదలుకానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు రెడీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More