మహేష్ చాలా కొత్తగా కనిపిస్తాడు: కొరటాల శివ

ప్రస్తుతం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రముఖుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ క్రేజ్ బాగా పెంచేసింది. అయితే దర్శకుడు కొరటాల శివ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

కొరటాల శివ మాట్లాడుతూ.. మహేష్ ఫెంటాస్టిక్ యాక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ దర్శకుడితో పని చేసినా వంద శాతం తన వర్క్ ని కరెక్ట్ గా చేస్తాడు. అంతే కాకుండా భరత్ అనే నేను సినిమాలో అతను చేసిన పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. క్యారెక్టర్ లో నిజంగా మహేష్ ఒదిగిపోయాడనే చెప్పాలి. ఓ రకంగా ఆయనను చాలా కొత్తగా చూస్తారని దర్శకుడు కొరటాల వివరించారు. ఈ నెల 20న సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. డివివి.దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించిన సంగతి తెలిసిందే.