శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. 2016లో విడుదలైన ఈచిత్రం మహేష్ కెరీర్ లోనే ఘోర పరాజయం పాలైన చిత్రం గా నిలిచింది. కుటుంభ కథ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మహేష్ కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ భాషలో ‘అనిరుధ్’ పేరుతో అనువదించారు. ఈచిత్రం అక్కడ ఆగష్టు 10న విడుదల కానుంది.
అదే రోజు లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక తమిళ్లో కమల్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి దాన్ని తట్టుకొని అనిరుధ్ ఎలా నిలబడతాడో చూడాలి. కాజల్ , సమంత , ప్రణీత హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్నిపివిపి నిర్మించారు. భద్రకాళి ఫిల్మ్స్ ఈచిత్రాన్ని తమిళనాడు లో విడుదలచేస్తుంది.


