విషాదం : కత్తి మహేశ్‌ మృతి !

Published on Jul 10, 2021 6:04 pm IST

నటుడు మరియు క్రిటిక్ కత్తి మహేశ్‌ పెను ప్రమాదం నుండి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతూనే ఈ సాయంత్రం కత్తి మహేష్ కన్నుమూశారు. ఆయనకు వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. కత్తి మహేష్ నటుడిగా ఎదుగుతున్న టైంలో ఇలా జరగడం బాధాకరమైన విషయం.

చికిత్సకి మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా ఆయన ఆరోగ్య ప‌రిస్థితి ఒక్కసారిగా విష‌య‌మించింది. కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో తన బంధువుల ఇంటికి వెళ్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురి అయింది. చివరకు ఆ ప్రమాదమే ఆయన ప్రాణాలను తీసింది. ‘123తెలుగు.కామ్’ నుండి కత్తి మహేష్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :