దర్శకుడు అనిల్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న మహేష్

Published on Jan 10, 2020 9:11 am IST

సూపర్ స్టార్ మహేష్ దర్శకుడు అనిల్ రావిపూడిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నాడు. అనిల్ ఎనర్జీ పీక్స్ అంటున్నారు. సెట్ లో సరదాగా మరియు ఉత్సాహంగా ఉండే అనిల్ చాల యాక్టీవ్ అన్నారు మహేష్. కేవలం ఐదు నెలల్లో ఇంత పెద్ద సినిమా ఎలా చుట్టేశాడు అని నాకే ఆశ్చర్యం వేసింది అన్నారు. కేరళ షెడ్యూల్ సమయంలో మూడు గంటలకే చీకటిపడిపోయేది. అనుకున్న ప్రకారం షెడ్యూల్ కంప్లీట్ అవుతుందా లేదా అని నాకు అనిపించేది. కానీ అనిల్ కాన్ఫిడెంట్ గా ఉండేవాడు. దర్శకుడు యాక్టీవ్ గా ఉన్నపుడు సెట్ లోని వారందరూ చాలా ఎనర్జీతో ఉంటారు. అలాంటి దర్శకుడే అనిల్ రావిపూడి..మళ్ళీ అతనితో సినిమా చేయడానికి సిద్ధం అని మహేష్ దర్శకుడు అనిల్ ని పొగడ్తలతో ముంచేశారు.

ఇక మహేష్ తన తదుపరి చిత్రం మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుగ రేపు విడుదల కానుంది. మహేష్ కి జంటగా రష్మిక మందాన నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :