మహేష్ నెక్స్ట్ దర్శకుడు అతడేనట..!

Published on Feb 26, 2020 1:30 am IST

సూపర్ స్టార్ మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి మూవీ పక్కన పెట్టారు. దీనితో ఆయన తదుపరి చిత్రం ఏ దర్శకుడితో చేస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐతే తాజా సమాచారం ప్రకారం మహేష్ గీత గోవిందం ఫేమ్ పరుశురాం తో ఫిక్స్ అయ్యారట. మహేష్ పరుశురాం స్క్రిప్ట్ లాక్ చేయడంతో పాటు సినిమాకు సిద్ధం అయ్యారని విశ్వనీయ సమాచారం. ఈ చిత్రాన్ని 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనుందట.

ఇక మహేష్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిరంజీవి మూవీలో కూడా కనిపించనున్నారని తెలుస్తుంది. 30 నిమిషాలకు పైగా ఉండే ఈ కీలక పాత్ర మహేష్ చేయడానికి ఒప్పుకున్నారని వినికిడి. ప్రస్తుతం మహేష్ ఓ యాడ్ షూటింగ్ కొరకు ముంబై వెళ్లారు. తదనంతరం కొరటాల శివ-చిరు మూవీలో జాయిన్ అవుతారట.

సంబంధిత సమాచారం :

X
More