‘మహర్షి’ లో మహేష్ లుక్ ఆకట్టుకుంటుంది !

Published on Oct 23, 2018 9:38 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ యూఎస్ లో జరుగుతుంది. ఇక ఈ సెట్స్ నుండి లీకైన మహేష్ పిక్ అయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మహేష్ బిజినెస్ మేన్ లుక్ లో వున్నా ఈ ఫొటో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :