మహేష్ మేనియాతో ఊగిపోతున్న తెలుగు రాష్ట్రాలు

Published on Jan 9, 2020 9:52 am IST

తెలుగు రాష్ట్రలలో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. నేటి నుండి సంక్రాంతి చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయి. ఇక తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతికి వస్తున్న తమ అభిమాన హీరో సినిమా విడుదలను అభిమానులు అట్టహాసంగా భారీ ఎత్తున జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ అభిమానులు సందడి కోలాహలంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మహేష్ అభిమానులు థియేటర్స్ దగ్గర భారీ కట్ అవుట్ లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పూలదండలతో అలంకరించడంతో పాటు, పాలాభిషేకాలు చేస్తున్నారు. చాలా కాలం తరువాత మహేష్ మూవీ సంక్రాంతికి విడుదలవుతుంది. చివరిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది.

దేవిశ్రీ సాంగ్స్, అనిల్ రావిపూడి మార్క్ ట్రైలర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ రీత్యా చిత్ర యూనిట్ మూవీ విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుండగా, విజయ శాంతి 13ఏళ్ల తరువాత ఓ కీలక రోల్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :